Homeతెలంగాణరెగ్యులరైజ్​ చేయండి

రెగ్యులరైజ్​ చేయండి

– ట్యాంక్​ బండ్​ వద్ద ఆశా కార్మికుల ధర్నా

ఇదేనిజం, హైదరాబాద్​: తమను రెగ్యులరైజ్​ చేయాలంటూ హైదరాబాద్​లోని ట్యాంక్​ బండ్​ వద్ద ఆశా కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. పదేండ్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలను అందించిన తమను రెగ్యులర్ చేయాలంటూ నిరసనకు దిగారు. కరోనా సమయంలో కుటుంబాలను కూడా పక్కన పెట్టి ప్రజా సేవ చేసినందుకు ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6,000 మంది ఏఎన్‌ఎమ్‌లను రెగ్యులర్ చేయాలని కోరారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వందమంది ఏఎన్‌ఎమ్‌లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేయడంపై ఏఎన్‌ఎమ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img