హైదరాబాద్, ఇదేనిజం – రౌడీషీటర్ల ఆగడాలను భరించేదిలేదని గోషామహాల్ ఏసీపీ డివిజన్ హబిబ్నగర్ పోలీస్ స్టేసన్ క్రైం ఇన్స్‌స్పెక్టర్ బి. నర్సీంహా అన్నారు. గురువారం ఆయన తన పరిధిలోని రౌడీషీటర్లను స్టేషన్‌కు పిలిచి తన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ…. మొహారం, గణేష్ జంట పండగల దృష్ట్యా రౌడీషీటర్ల నివాస ఎరియల్లో ఏలాంటి ఇబ్బందులు సృష్టించిన వారికి జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. కేసు విచారణ, దర్యాపుల విషయంలో పోలీసులు పిలిచిన వేంటనే స్టేషన్లో హాజరుకావాలని ఆయన హుకాం జారిచేశారు. అలాగే రాత్రీ 9 గంటలోపు ఇంటిలోకి చేరుకోవాలని, ప్రజలకు భయభ్రాంతులకు గురిచేస్తే దండన తప్పదన్నారు.