Homeఅంతర్జాతీయంవిక్రమ్ ల్యాండర్​ను ఫొటో తీసిన నాసా ఉపగ్రహం

విక్రమ్ ల్యాండర్​ను ఫొటో తీసిన నాసా ఉపగ్రహం

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: చంద్రయాన్​–3కి సంబంధించిన ప్రతీ అప్​డేట్​ను ఇస్రో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జనాలకు ఇంట్రెస్ట్ ను పెంచుతోంది. తాజాగా అమెరికాకు చెందిన నేషనల్‌ ఏరోనాటిక్స్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌(నాసా)కు చెందిన ఉపగ్రహం తీసిన చంద్రయాన్‌-–3 ల్యాండర్‌ ఫొటోను ఎక్స్‌(ట్విటర్‌)లో పంచుకుంది. తమ ఉపగ్రహం ఈ ఫొటోను తీసినట్లు నాసా తెలిపింది. ‘జాబిల్లి ఉపరితలంపై ఉన్న చంద్రయాన్‌–-3 ల్యాండర్‌ను నాసాకు చెందిన ఎల్‌ఆర్‌ఓ(లునార్‌ రికానజెన్స్‌ ఆర్బిటర్‌) స్పేస్‌క్రాఫ్ట్‌ ఫొటో తీసింది. ఆగస్టు 23న ఈ ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువానికి సుమారు 600 కి.మీ దూరంలో దిగింది’ అని నాసా వెల్లడించింది. ల్యాండర్ దిగిన నాలుగురోజుల తర్వాత ఆగస్టు 27న ఎల్‌ఆర్‌వో ఈ చిత్రాన్ని తీసింది. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ దిగుతున్నప్పుడు కలిగిన రాపిడి వల్ల ఒక తెల్లని వలయం ఏర్పడిందని ఈ ఫొటోలను చూస్తే తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img