Homeతెలంగాణవీఆర్ఎస్​ కు దరఖాస్తు చేసుకున్న ‘దిశ’ కేసు ఏసీపీ

వీఆర్ఎస్​ కు దరఖాస్తు చేసుకున్న ‘దిశ’ కేసు ఏసీపీ

– డీజీపీకి దరఖాస్తు చేసుకున్న అధికారి

ఇదేనిజం, హైదరాబాద్​: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఎన్​ కౌంటర్​ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ‘దిశ’ నిందితుల ఎన్​ కౌంటర్​ జరిగినప్పుడు షాద్​ నగర్​ ఏసీపీగా ఉన్న సురేంద్ర స్వచ్ఛంద పదవీవిరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈమేరకు ఆయన డీజీపీ అంజనీ కుమార్‌కు దరఖాస్తును సమర్పించారు. ఇటీవల తరచూ బదిలీలపై అసంతృప్తి కారణంగానే సురేంద్ర వీఆర్‌ఎస్‌ తీసుకుంటుననట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ విభాగానికి బదిలీ అయ్యారు. అంతకుముందు ట్రాన్స్‌కో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీగా ఆయన పని చేశారు.

Recent

- Advertisment -spot_img