Homeతెలంగాణసచివాలయంలో సందడి

సచివాలయంలో సందడి

– ఆలయం, మసీదు, చర్చి ప్రారంచించిన గవర్నర్​, సీఎం
– పూర్ణాహుతిలో పాల్గొన్న గవర్నర్​, ముఖ్యమంత్రి

ఇదేనిజం, హైదరాబాద్​: సీఎం కేసీఆర్​, గవర్నర్​ తమిళిసై సచివాలయంలో ఆలయం, మసీదు, చర్చి ప్రారంభించారు. దీంతో సెక్రటేరియల్​ లో సందడి వాతావరణం నెలకొన్నది. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు గవర్నర్​ తమిళిసై ఇవాళ సచివాలయంలో ఆలయాల ప్రారంభోత్సవానికి గవర్నర్​ వెళ్లారు. సచివాలయ ప్రాంగణంలోని నల్లపోచమ్మ ఆలయ ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నల్లపోచమ్మ ఆలయంలో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కొంతకాలంగా రాజ్ భవన్​, ప్రగతి భవన్​ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల గవర్నర్​ తమిళిసై, సీఎం కేసీఆర్​ మధ్య సయోధ్య కుదిరినట్టు కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులను గవర్నర్​ పెండింగ్​ లో ఉంచారు. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇటీవల కేబినెట్​ ఆమోదించిన ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదించేందుకు కూడా గవర్నర్​ ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. కాగా ఎట్టకేలకు పట్నం మహేందర్​ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవ వేళ.. సీఎం కేసీఆర్​, గవర్నర్​ తమిళిసై ఒక్కటయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు వీరి భేటీ సాగింది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img