Homeహైదరాబాద్సరుకు కాపాడబోయి కరెంటు కాటుకు బలి

సరుకు కాపాడబోయి కరెంటు కాటుకు బలి

రాజేంద్రనగర్, ఇదే నిజం : వర్షానికి తడుస్తున్న సరుకును కాపాడే క్రమంలో లారీ డ్రైవర్​ ప్రాణాలు కోల్పోయాడు. లారీలోని సరుకు వర్షానికి పాడవుతుందని లారీ పైన తాడిపత్రి కప్పే క్రమంలో పైన ఉన్న విద్యుత్ వైర్లు గమనించలేదు ఆ డ్రైవర్​. దీంతో వాటికి తగిలి అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘట మైలర్​దేవ్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కటేడాన్ పారిశ్రామిక వాడలో సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల ప్రాధమిక సమాచారం ప్రకారం కటేడాన్ పారిశ్రామిక వాడలోని రజిని ఫుడ్స్ కంపెనీ ప్రక్కన ఓ లారిలోని సరుకు ధింపుతుండగా అకస్మాత్తుగా వర్షం కురిసింది. రాజేంద్రనగర్ మండల పరిధిలోని ఉప్పర్ పల్లికి చెందిన లారీ డ్రైవర్ మొహమ్మద్ ఫయజ్ ఉద్దీన్(52) లారీలోని సరుకు పాడవుతుందని వెంటనే లారిపైన తాడిపత్రి కప్పేందుకు లారీపైకి ఎక్కగా, వర్షంలో లారీ పైన ఉన్నవిద్యుత్ లైన్ గమనించక పోవడంతో ప్రమాదానికి గురయ్యాడు దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img