Homeతెలంగాణహరీశ్ ,కేటీఆర్ కు బీఆర్ఎస్ గెలుపు బాధ్యతలు

హరీశ్ ,కేటీఆర్ కు బీఆర్ఎస్ గెలుపు బాధ్యతలు

ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్న బావ బామ్మర్థులైన హరీశ్ రావు, కేటీఆర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు బాధ్యతలను మోయనున్నారు . ఈ బాధ్యతలను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత స్థానాల్లో ప్రజాకర్షణ ఉన్న నాయకుల్లో హరీశ్ ,కేటీఆర్ ముందు వరుసల్లో ఉన్నారు . ఈ విషయం తెలిసిన సీఎం వీరికి మూడో సారి అధికారం లోకి తెచ్చే బాధ్యతను అప్పగించారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో గెలుపు బాధ్యత ఒకరిదైతే , దక్షిణ తెలంగాణ బాధ్యత మరొకరికి అప్పగించారు . కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి బండి సంజయ్, ధర్మపురి అరవింద్ , రఘునందన్ లను ధీటుగా ,ఘాటుగా ఎదుర్కోవాలంటే హరీశ్ ,కేటీఆర్ మాత్రమే సమర్ధులని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది . మాటకారితనం, సబ్జెక్టు ఉన్న నేతలుగా పేరున్న వీరిద్దరిని ఎంపిక చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నప్పటికీ గెలుపే టార్గెట్ గా బరిలోకి దిగనున్నారు

కేటీఆర్ విషయానికి వస్తే కీలకమైన బాధ్యతలు మోయనున్నారు . ఉమ్మడి హైదరాబాద్ , రంగారెడ్డి , మహబూబ్ నగర్ , ఖమ్మం ప్రచార బాధ్యతలతో పాటు మెదక్ లో కూడా హరీష్ రావు తో పాటు ప్రచార బాధ్యతలు పంచుకోనున్నారు. జీహెచ్ఎంసీ కీలకం కానున్న నేపథ్యంలో ఇక్కడ కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించనున్నారు . అంతే కాకుండా పార్టీ గెలుపుకు దోహదం అవుతుంది అనుకున్న ప్రాంతాల్లో కేటీఆర్ ప్రచారం చేయనున్నారు . ఇప్పటికే ఎన్నికల హడావుడి పెరిగిన నేపథ్యంలో త్వరలో రంగంలోకి దిగనున్నారు . స్థానిక ఎమ్మెల్యేలు , మంత్రుల్లో చాల మందికి ప్రజల్లో వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు .

ఉత్తర తెలంగాణ బాధ్యతలతో పాటు అవసరమైనప్పుడు ఇతర ప్రాంతాల్లో ప్రచార బాధ్యతలను ట్రబుల్ షూటర్ గా పేరున్న హరిశ్ రావుకు అప్పగించారు . ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్,మెదక్, ఆదిలాబాద్,నిజామాబాదు, వరంగల్ బాధ్యతలు హరీష్ కు అప్పగించినట్లు తెలిసింది. ఈ జిల్లాల్లో కేటీఆర్ పర్యటించి ప్రచారం చేసే అవకాశం ఉన్నప్పటికీ గెలుపు బాధ్యతలు హరీశ్ రావుకు అప్పగించినట్లు తెలిసింది. దీనికి ముందుగా ప్రతి నియోజకవర్గంలో పరిస్థితులు , అసమ్మతి నాయకుల బుజ్జగింపు వంటి ప్రతి విషయాన్నీ చూసుకుని గెలుపు బాటలు వేయాల్సి ఉంటుంది . గెలుపు గుర్రాలను మాత్రమే టిక్కెట్లకు రికమెండ్ చేయాల్సి ఉంటుంది .

కేసీఆర్ సభలపై ఎమ్మెల్యేలు ఆసక్తి కనపరుస్తున్న దృష్ట్యా అయన ప్రచారం కూడా తప్పకుండా ఉంటుంది . ముచ్చటగా మూడోసారి అధికారం లోకి రావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు . స్థానికంగా చాలా మంది ఎమ్మెల్యేలు నియోజక వర్గాల్లో ప్రభావం కోల్పాయారు . గత ఎన్నికల్లో మాదిరిగా కేసీఆర్ చరిష్మా మాత్రమే అభ్యర్థుల గెలుపుకు దోహదం చేసే పరిస్థితులు పార్టీలో ఉన్నాయి , . స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు , మంత్రులు భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు . అవినీతి ఆరోపణలూ ఉన్నాయి. దీంతో స్థానిక ప్రజలకు అక్కడి నాయకులపై విశ్వాసం తగ్గి వ్యతిరేకత పెరిగింది. వీటిని అధిగ మించాలంటే హరీశ్ రావు, కేటీఆర్ తో సీఎం కేసీఆర్ కీలకంగా వ్యవహరించనున్నారు .ఎమ్మెల్యేలు , మంత్రులు ఇప్పటినుంచే తమ నియోజక వర్గాల్లో ప్రచారం చేయాలని కేసీఆర్ ను కోరుతున్నారు.ఐతే కేసీఆర్ ప్రచార సభలపై , వ్యూహాలమీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img