ఈ ప్రపంచంలో ఎక్కువ కాలం నివసించే వ్యక్తులు ఏ దేశంలో ఉన్నారంటే.. జపాన్ లోని ఒకినావా గ్రామంలోని ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారట. అంతే సంతోషంగా కూడా ఉంటారని ఇకిగై పుస్తకం చెబుతోంది. అక్కడి ప్రజలకు అనారోగ్య సమస్యలు తక్కువగా, ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుందట. ఒకినావాలో ప్రజల అయుర్ధాయం 87 ఏళ్ల వరకు ఉంటుంది. గ్రీస్కు చెందిన ఇకారియాలో నివసించే ప్రజల ఆయుర్ధాయం 90 ఏళ్లకు పైగా, ఇటలీలోని సార్డినియాలో ఆయుర్దాయం 100, అమెరికాలోని లోమా లిండా CAలో పురుషులు 89, స్త్రీలు 91 ఏళ్లు జీవిస్తారట.