– కేంద్రాన్ని నిలదీసిన ఎస్పీ నేత డింపుల్ యాదవ్
ఇదేనిజం, నేషనల్ బ్యూరో: మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో గురువారం జరిగిన చర్చలో సమాజ్వాదీ పార్టీ నేత, ఎంపీ డింపుల్ యాదవ్.. మోడీసర్కార్‌ను నిలదీశారు. మహిళా బిల్లుపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. పదేండ్లుగా ఎన్నడూ లేనిది ప్రభుత్వానికి ఇప్పుడు హఠాత్తుగా మహిళలు ఎందుకు గుర్తుకువచ్చారని డింపుల్ యాదవ్ ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే మోడీ సర్కార్‌కు మహిళలు గుర్తుకువచ్చారని ఆమె విమర్శించారు.