మృతదేహానికి రాఖీ కట్టిన సోదరి
ఎలిగేడు: గుండెపోటుతో అన్న చనిపోవడంతో సోదరి మృతదేహానికి రాఖీ కట్టింది. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూలికట్టలో చోటుచేసుకున్నది. గుండెపోటుతో చౌదరి కనకయ్య అనే యువకుడు హఠాన్మరణం చెందాడు. దీంతో అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చిన అతడి సోదరి గౌరమ్మ పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న అన్న ఒక్కసారిగా విగతజీవిగా మారడంతో గుండెలవిసేలా రోదించింది. తీవ్ర దుఃఖంతోనే సోదరుడి మృతదేహానికి రాఖీ కట్టింది.