పనిమొదలుపెట్టిన రోవర్
– ల్యాండర్ నుంచి బయటకు..
– వీడియో విడుదల చేసిన ఇస్రో..
ఇదేనిజం, నేషనల్ బ్యూరో: చంద్రయాన్-3 ల్యాండర్ విజయవంతంగా చంద్రుడిపై కాలుమోపిన విషయం తెలిసిందే. కొన్ని గంటల తర్వాత అందులో నుంచి రోవర్ బయటకు వచ్చి తన అధ్యయనాన్ని ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రస్తుతం ఇస్రో విడుదల చేసింది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్-3 ల్యాండర్ విజయవంతంగా చంద్రుడిపై కాలుమోపగా.. కొన్ని గంటల తర్వాత అందులో నుంచి రోవర్ బయటకు వచ్చి తన అధ్యయనాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇస్రో తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది. ల్యాండర్ నుంచి రోవర్ జారుకుంటూ జాబిల్లి ఉపరితలంపైకి అడుగుపెట్టిన దృశ్యాలను పంచుకుంది.