Homeఆంధ్రప్రదేశ్పిస్టల్ తో కాల్చుకుని చనిపోవాలనుకున్నా… : జనసేన అధినేత పవర్ స్టార్, పవన్ కళ్యాణ్

పిస్టల్ తో కాల్చుకుని చనిపోవాలనుకున్నా… : జనసేన అధినేత పవర్ స్టార్, పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్.. ఈ పేరు ఒక ప్రభంజనం. ఎమ్మెల్యే గా గెలువకున్నా రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తూ.ప్రతిపక్ష పార్టీల్లో వణుకు పుట్టిస్తున్న శక్తి. ఆయన నినాదం, విధానం ప్రత్యేకం. కోట్లాది మంది అభిమానులున్న ఓ సినిమా హీరో, నాయకుడు. ఆయన గమ్యం, లక్ష్యం ఒక్కటే ప్రస్తుత రాజకీయాలు మారాలి. మార్పు రావాలి. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో యువత ను ఆకర్శించింది. వయో బేధం లేకుండా అందరివాడిని చేసింది. రాజకీయ యవనికపై ఒక మహత్తర రాజకీయ శక్తిగా చర్చకు తెరతీసింది. మూడు పెళ్లిళ్ల వ్యవహారం ప్రతిపక్ష నేతలకు అస్త్రంగా మారినా.. వారాహి వంటి సమస్యలు ఎన్ని వచ్చినా చెక్కుచెదరని మనో నిబ్బరం పవన్ కళ్యాణ్(Pawan kalyan )స్వంతం
పక్కన ఎవ్వరూ లేకున్నా ఒంటరిగా నిలబడ్డ ధీరుడు పవన్ (Pawan Kalyan). ఎన్ని విమర్శలు వచ్చినా బెదురకుండా, భయపడకుండా లక్ష్యం వైపు దూసుకువెళ్తున్న పవన్.. ఎందుకో ఒక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.

పవన్ కళ్యాణ్ వాస్తవానికి సినిమా హీరో అవుతానని ఊహించలేదట. సినిమాల్లో ఒక టెక్నీషియన్ అవుతే చాలు అనుకున్నాడట. ఇంత స్టార్ డం వస్తుంది అనుకోలేదట. ఒక సందర్భం లో పనికిరాని వ్యక్తిగా మిగిలిపోతానని భయపడ్డాడట. కనీసం అమ్మా నాన్న కు కూడా ఉపయోగపడను అని అనిపించిందంట పవన్ కళ్యాణ్ (pawan kalyan )కి. అందరూ ఉన్నత చదువులు చదువుకుంటే.. పవన్ కళ్యాణ్ (pawan kalyan )కి అటువంటి చదువులు నచ్చేది కాదట. పొంతన లేని చదువులు అవసరమా అనుకునే వాడట.

రివాల్వార్ తో కాల్చుకుని చనిపోవాలని అనుకున్నాడట పవన్ కళ్యాణ్. అయనకున్న అస్తమా ప్రాబ్లెమ్ ను తట్టుకోలేక తీవ్రంగా ఇబ్బంది పడేవాడట. డైలీ ఇబ్బంది ని తట్టుకోలేక పోయేవాడినని.. అందుకే వాళ్ళ పెద్ద అన్నయ్య చిరంజీవి కి సంబంధించిన రివాల్వార్ తీసుకుని కాల్చుకోవాలి అని అనుకున్నాడట. చాలా రోజులుగా డల్ గా ఉంటున్న పవన్ ను గమనించిన రెండో అన్నయ్య నాగబాబు.. విషయం ఏంటని పవన్ ని అడగగా అసలు విషయం పవన్ కళ్యాణ్ (pawan kalyan ) చెప్పాడంట. ఈ విషయం చిరంజీవి కి తెలియ చేయడంతో పవన్ తో మాట్లాడి సెట్ చేసాడట. డిప్రెషన్ నుంచి బయట పడటానికి పుస్తక పఠనం ఉపయోగ పడిందంట. ఇదంతా పవన్ 17 ఏళ్ల వయసులో జరిగిందంట. ఈ విషయాన్ని ఆహా OTT వేదికపై హీరో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న unstoppable ప్రోగ్రాం లో స్వయంగా పవన్ కళ్యాణ్ (pawan kalyan) వెల్లడించారు. పవన్ కళ్యాణ్ అప్పుడు క్షణికావేశం లో నిర్ణయం తీసుకుంటే ఇంత గొప్ప హీరోను , నాయకుడిని తెలుగు ప్రజలు మిస్ అయి ఉండేవారు. మీరేమంటారు తెలియచేయండి.

Recent

- Advertisment -spot_img