Homeజిల్లా వార్తలుమాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవేడుకలు

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవేడుకలు

ఇదే నిజం, దేవరకొండ: డిండి మండల కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలుఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జంతుక, రేణయ్య మాదిగ, నల్లగొండ జిల్లా సినీయర్ నాయకుడు బొడ్డు, శ్రీకాంత్ మాదిగ మాట్లాడుతూ 1994 ప్రకాశం జిల్లా ఈదిమూడి అనే చిన్న గ్రామంలో గౌరవ మందా కృష్ణ మాదిగ నాయకత్వంలో ఏర్పడిన సంఘమే ఎమ్మార్పీఎస్ మందకృష్ణ మాదగ నాయకత్వంలో అనేక సామాజిక ఉద్యమాలు చేస్తూ గుండె జబ్బు పిల్లలకు ఉచితంగా ఆపరేషన్ చేయించాలనే ఉద్యమం అన్ని వర్గాల ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకానికి దారితీసింది. అదేవిధంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వికలాంగులందర్నీ ప్రోగు చేసి ఉద్యమిస్తే వచ్చిన ఫలితమే వికలాంగుల పెన్షన్ పెరగడానికి దారితీసింది. అదేవిధంగా గత 30 సంవత్సరాలుగా మాదిగ ఉప కులాలకు రిజర్వేషన్లు సమాన పంపిణీ జరగాలని చేస్తున్న పోరాటమే ఎమ్మార్పీఎస్ ఉద్యమం అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ వర్గ ప్రజలపై దాడులు హత్యలు అత్యాచారాలు జరిగితే సత్వరమే న్యాయం జరగాలని చేసిన పోరాట ఫలితమే అన్ని జిల్లా కేంద్రాల్లో ఫాస్ట్ ట్రాక్కోర్టు ఏర్పడడానికి దారితీసింది. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకుడు బోల్లే, శైలేష్ మాదిగ,ఎదుర్ల, కుమార్ మాదిగ కొమ్మర, నాగరాజు మాదిగ, కుమార్ మాదిగ, లింగామయ్య మాదిగ ఎమ్మెస్ ఎఫ్ నాయకులు చింతకుంట్ల, కుమార్ మాదిగ. ఒగ్గు హరీష్ మాదిగ, కొమ్మర జానీ మాదిగ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img