– మూడ్రోజుల కిందట కవాడీగూడ నాలాలో పడి గల్లంతు
– ముసారాంబాగ్ బ్రిడ్జి కింద డెడ్‌బాడీని గుర్తించిన స్థానికులు
ఇదే నిజం, వెలుగు: మూడ్రోజుల కిందట కవాడీగూడ పరిధిలోని నాలలో పడి గల్లంతైన లక్ష్మమ్మ(55) డెడ్‌బాడీ మూసీ నదిలో కొట్టుకొచ్చింది. బుధవారం ఉదయం ముసారాం బాగ్ బ్రిడ్జి కింద మూసీ నదిలో మహిళ డెడ్‌బాడీని గుర్తించిన స్థానికులు అంబర్‌పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. కవాడీగూడలోని డీఎస్‌నగర్ కు చెందిన లక్ష్మమ్మగా గుర్తించారు. లక్ష్మమ్మ మిస్సింగ్‌పై గత ఆదివారం రాత్రి ఆమె కుటుంబసభ్యులు గాంధీనగర్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. అయితే, ఆమె ఇంటి వెనుక ఉన్న హుస్సేన్ సాగర్ నాలాలో పడి ఉండొచ్చని భావించిన పోలీసులు బల్దియా డీఆర్ఎఫ్ టీమ్స్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సోమ, మంగళవారం రెండ్రోజుల పాటు గాలించినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. బుధవారం ఉదయం లక్ష్మమ్మ డెడ్‌బాడీ మూసీ నదిలో కొట్టుకురాగా.. విషయం తెలుసుకున్న ఆమె ఇద్దరు కూతుళ్లు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు డెడ్‌బాడీని ఉస్మానియాకు తరలించారు.