వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌ను షేర్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ ఎనేబల్ చేసుకోవాలంటే వాట్సాప్ సిస్టమ్ ఫైల్, ఫొటోల గ్యాలరీ యాక్సెస్ లాంటి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు పంపించాలనుకుంటున్న వ్యక్తి మొబైల్ బ్లూటూత్ కనెక్ట్ అయ్యేంత దగ్గర్లో ఉంటేనే ఆఫ్‌లైన్ షేరింగ్‌కు వీలవుతుంది.