నేడు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 128.33 పాయింట్ల లాభంతో 74,611.11 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 37.80 పాయింట్లు లాభపడి 22,642.65 వద్ద స్థిరపడింది. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.