Homeఅంతర్జాతీయంఈ మ‌ద్యం బాటిల్ ధ‌ర అక్ష‌రాలా కోటి రూపాయ‌లు #Whisky #CostlyWine

ఈ మ‌ద్యం బాటిల్ ధ‌ర అక్ష‌రాలా కోటి రూపాయ‌లు #Whisky #CostlyWine

మన వద్ద మద్యం ఫుల్ బాటిల్ ధర అటూ ఇటుగా రూ.1000 లేదంటో రూ.2000 ఉంటుంది.

ఇతర ప్రాంతాల్లో అయితే ఇంకా తక్కువే ఉంటుంది. ఇక ప్రీమియమ్ మద్యం ధర రూ.10వేల వరకు ఉంటుంది.

మరికొన్ని రూ.10లక్షల వరకూ విలువైనవి ఉన్నాయి. కానీ, ఒక మద్యం బాటిల్‌ అక్షరాలా కోటి రూపాయలకు అమ్ముడైంది.

అసలు ఈ లిక్కర్ ఏంటీ? దానికి అంత ధర ఎందుకనుకుంటారా? ఇది ప్రపంచంలోనే పురాతనమైంది ఈ విస్కీ బాటిల్‌. 250 సంవత్సరాల కాలం నాటి కిందటిది.

దాని అసలు ధర కంటే ఆరు రెట్ల ధరకు వేలంలో అమ్ముడైంది. బాటిల్‌ను వేలం వేయగా.. 1,37,000 డాలర్లు (భారత కరెన్సీలో రూ.1,02,63,019) పలికింది.

ఓల్డ్ ఇంగ్లెడ్వ్ విస్కీని బాటిల్‌ను 1860లో తయారు చేయగా.. అయితే, అందులో ఉన్న మద్యం మాత్రం వంద సంవత్సరాల నాటి కాలం నాటిదని భావిస్తున్నారు.

యాక్షన్‌ హౌస్‌ స్కిన్నర్‌ ఇంక్‌ బాటిల్‌కు 20వేలు, 40వేల డాలర్లు లభిస్తాయని అంచనా వేయగా.. జూన్ 30తో ముగిసిన వేలంలో ఈ బాటిల్‌ను మిడ్‌టౌన్ మాన్హాటన్‌లోని మ్యూజియం, పరిశోధనా సంస్థ ది మోర్గాన్ లైబ్రరీకి 137,500 డాలర్లకు కొనుగోలు చేసింది.

బాటిల్‌ ప్రసిద్ధ ఫైనాన్షియర్ జాన్ పియర్ పాయింట్ మోర్గాన్‌కు చెందినది. బాటిల్ వెనుక భాగంలో లేబుల్‌ సైతం ఉన్నది.

దానిపై ‘ఈ బౌర్బన్‌ బహుశా ముందే తయారు చేయబడి ఉండొచ్చు. జాన్‌ పియర్‌పాయింట్ మోర్గాన్ గదిలో ఉంది.

అతని మరణం తర్వాత ఎస్టేట్ నుంచి సంపాదించబడింది’ అని రాసి ఉంది.

1900ల్లో జార్జియా పర్యటనలో జేపీ మోర్గాన్‌ ఈ మద్యం బాటిల్‌ను కొన్నారని నిపుణులు భావిస్తున్నారు.

ఆ తర్వాత ఆయన తన కొడుకు ఇచ్చారని, అతను దాన్ని 1942-44 మధ్య దక్షిణ కరోలినా గవర్నర్‌ జేమ్స్‌ బైర్నెస్‌కు ఇచ్చారు.

1955లో పదవీ విరమణ చేసిన తర్వాత.. ఆయన దాన్ని స్నేహితుడు, ఆంగ్ల నావికాదళ అధికారి ఫ్రాన్సిస్‌ డ్రేక్‌కు పంపారు.

ఆయన దాన్ని మూడు తరాల పాటు కాపాడారు.

ఇప్పటికీ విస్కీ బాటిల్‌ రెండు శతాబ్దాలకుపైగా చెందినది మద్యం ప్రస్తుతం తాగేందుకు వీలు కాదని, బాటిల్‌ తెరువకపోతే సుమారు పది సంవత్సరాల పాటు నిల్వ ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Recent

- Advertisment -spot_img