పార్లమెంట్ ఎన్నికల హామీలో భాగంగా రాజకీయ నాయకుల హామీలు జోరందుకుంటున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనాలను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అక్కడి ప్రజలకు తీపికబురు చెప్పింది. రానున్న ఎన్నికల్లో గెలిస్తే సంవత్సరానికి 10 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని సంచలన హామీ ఇచ్చింది. ఈ నిర్ణయంపై అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.