నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్క్ష హీరోగా ఎంట్రీ ఖరారైన సంగతి తెలిసిందే. ‘హనుమాన్’ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్సకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్-లెజెండ్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. మరి ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు అని వినిపిస్తోంది.ఈ సినిమాని పాన్ ఇండియా కోసం ప్లాన్ చేస్తున్నారు. మోక్షజ్ఞ సూపర్‌హీరో అని ప్రచారం జరుగుతోంది. హనుమాన్ తరహా ఫాంటసీ థీమ్‌లో ఉంటుందని అంతా భావిస్తున్నారు. అయితే మోక్షజ్ఞ అరంగేట్రానికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 100 కోట్లుతో సినిమాని తీస్తున్నాడు అంటే మాములు విషయం కాదు. మరి మోక్షజ్క్ష ఈ సినిమా ఎంట్రీతో టాలీవుడ్ లో ఎన్ని రికార్డ్ సృష్టిస్తాడో చూడాలి.