ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ‘పుష్ప 2 ది రూల్’. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 6 గంటలకు జరుగనుంది. ఈ ప్రీరిలీజ్ ఫంక్షన్ కోసం భారీగా అల్లుఅర్జున్ ఫాన్స్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఈవెంట్ కోసం పోలీసులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి దాదాపు 1000 మంది పోలీసులను పోలీసు శాఖ సిద్ధం చేసింది. ఈ కార్యక్రమానికి వివిధ విభాగాలకు చెందిన వెయ్యి మంది పోలీసులు పనిచేస్తున్నారు. అంతే కాదు ఈవెంట్ నిర్వాహకులు ప్రైవేట్ బౌన్సర్లను కూడా రప్పించారు. సాధారణంగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగితే 200 నుంచి 500 మంది పోలీసు బందోబస్తు ఉంటుంది. కానీ ఈ ‘పుష్ప 2’ జాతర కోసం ఏకంగా 1000 మంది పోలీసులు అంటే వైల్డ్ ఫైర్ బందోబస్త్ అనే చెప్పాలి. ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది.