10th Class Exams : తెలంగాణలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు (10th Class Exams) ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. పరీక్ష ప్రారంభానికి 5 నిమిషాల ముందు వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మొత్తం 2,650 పరీక్షా కేంద్రాల్లో 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఏప్రిల్ 4న పదో తరగతి పరీక్షలు ముగుస్తాయి.