Homeహైదరాబాద్latest Newsకుక్కకాటుతో 11 మందికి గాయాలు.. భయాందోళనలో ప్రజలు

కుక్కకాటుతో 11 మందికి గాయాలు.. భయాందోళనలో ప్రజలు

ఇదేనిజం, రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం లో కుక్క కాటుతో 11 మందికి గాయాలపాలయ్యారు. పట్టణానికి చెందిన 10 మంది, రామాజీపేట గ్రామానికి చెందిన ఒకరు కుక్క కాటుకు గురికావడంతో స్థానిక ఉన్నత స్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రేబిస్ వ్యాధి, నిరోధక టీకా వేయించుకున్నారు. ఇందులో ఆరేళ్లలోపు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పట్టణంలో కుక్కల బెడద ఎక్కువ కావడంతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img