Homeహైదరాబాద్latest Newsసాయి ఆంజనేయస్వామి ఆలయ 12వ వార్షికోత్సవం.. ముఖ్య అతిథిగా అడ్లూరి

సాయి ఆంజనేయస్వామి ఆలయ 12వ వార్షికోత్సవం.. ముఖ్య అతిథిగా అడ్లూరి

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని చందోలి గ్రామంలో సాయి ఆంజనేయస్వామి ఆలయ 12వ వార్షికోత్సవం సందర్భంగా పూజారులు నరహరి శర్మ వారి బృందము ఆధ్వర్యంలో గణపతి పూజ హోమము తదితర పూజా కార్యక్రమాలు,అలాగే అన్నదానము చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికి స్వామివారి శేష వస్త్రం అందించి తీర్థ ప్రసాదాలు ఇచ్చినారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ గొల్లపల్లి మండల మాజీ జడ్పిటిసి మాజీ ఎంపీపీ మాజీ సింగల్ వీడియో చైర్మన్ కటారి కవిత చంద్రశేఖర రావు,గ్రామ మాజీ ఎంపీటీసీలు,మాజీ ఉపసర్పంచ్లు,మాజీ వార్డు సభ్యులు,గొల్లపల్లి మండల కాంగ్రెస్ నాయకులు రమేష్ రెడ్డి,ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img