ప్రస్తుతం దేశంలో ఎక్కడా చూసిన వినిపిస్తున్న సినిమా 12th FAIL. రెండు నెలల క్రితం బాలీవుడ్ లో సినిమా రిలీజ్ అయింది. మొదట్లో ఈ సినిమా గురించి అంతగా వినబడలేదు. ఆ తర్వాత నెమ్మదిగా ప్రేక్షకుల నోట ద్వారా పుంజుకొని సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను ప్రముఖ ఫిల్మ్ మేకర్ విధు వినోద్ చోప్రా తెరకిక్కించారు.
టాలీవుడ్ విషయానికి వస్తే నవంబర్ 3 న ఈ సినిమా రిలీజ్ అయింది. ఇక్కడ కూడా అంతగా ప్రభావం చూపలేకపోయింది. కానీ ఓటీటీలో రిలీజైన తర్వాత సినిమా దేశమంతా ఈ మూవీ గురించి మాట్లాడుతోంది. ప్రముఖుల చేత ప్రశంసలు అందుకుంటూ.. చివరికి ఇంటర్నెట్ మూవీ డేటాబేస్(IMDB)లో అత్యధిక రేటింగ్(9.2) సాధించిన ఇండియన్ సినిమాగా ఈ చిత్రం నిలిచింది.
ఇండియాలో టాప్ 250 సినిమాల్లో 12th FAIL చిత్రం మొదటి స్థానంలో ఉందంటే చిత్రం ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు. లిస్ట్ టాప్ 5లో 1993లో వచ్చిన యానిమేటెడ్ మూవీ రామాయణ, మణిరత్నం నాయకుడు, హృషికేష్ ముఖర్జీ గోల్ మాల్, మాధవన్ డైరెక్ట్ చేసిన రాకెట్రీ ఉన్నాయి.
ఈ సినిమా కథ ఇదే..
ఓ చిన్న పల్లెటూరి నుంచి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ.. సివిల్స్ లో ర్యాంక్ ఎలా సాధించాడో క్లియర్ కట్ గా చిత్రంలో డైరెక్టర్ చూపించాడు. ముంబై క్యాడర్(2005)కు చెందిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ శర్మ రియల్ లైఫ్ స్టోరినే ఈ చిత్రం. ఆయన సివిల్స్ కు ప్రిపేర్ ఆయన సమయంలో ఎదుర్కొన్న కష్టాల నేపథ్యంలో చిత్రం కొనసాగుతోంది. భారతీయ విద్యావ్యవస్థ గురించి తెలుపుతూనే.. సివిల్స్, గ్రూప్ 1 లాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థుల సమస్యలు, బాధలు, కష్టాలు, ఆర్థిక సమస్యలు గురించి ఈ చిత్రంలో చూపించిన తీరు అద్భుతం.
రూ.20కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.67కోట్ల వరకు వసూలు చేసింది. ఓటీటీలో ఈ చిత్రానికి మంచి ఆదరణ వస్తోంది. అయితే ఈ చిత్రం ఓన్లీ హిందీలోనే స్ట్రీమింగ్ అవ్వడంతో మిగితా భాషల్లో కూడా డబ్ చేయాలని ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. వేరే భాషల్లోకి సినిమా డబ్ అయితే భారీ కలెక్షన్ల దిశ దూసుకెళ్తుందనడంతో ఏ మాత్రం సందేహం లేదు. ఈ చిత్రంలోఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే , మేధా శంకర్ , అన్షుమాన్ పుష్కర్ , అనంత్ జోషి , హరీష్ ఖన్నా , ప్రియాంషు ఛటర్జీ కీలక పాత్రలు పోషించారు.