హైదరాబాద్: తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన ఫిర్యాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిదో అందరికీ తెలిసిందే. బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలంటూ విద్యార్థి సంఘాలు, దళిత–గిరిజన సంఘాలు మద్దతుగా ధర్నాలు సైతం చేశారు. మీడియాలో హైప్ సృష్టించిన ఈ కేసులో అనుహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశానని బాధిత యువతి మీడియాకు చెప్పింది. కొందరు దళిత, గిరిజన సంఘాల నేతలతో కలిసి హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు సమావేశంలో మాట్లాడింది. ఈ కేసులో టీవీ వ్యాఖ్యాత ప్రదీప్, నటుడు కృష్టుడుకు ఎలాంటి సంబంధం లేదని తాను తప్పుడు కేసులు పెట్టినందుకు వారికి క్షమాపణలు చెప్పారు.
అంతా చేయించింది డాలర్ బాయ్
ఈ కేసును పెట్టాలంటూ డాలర్ బాయ్ అలియాస్ శ్రీకర్‌రెడ్డి చిత్రహింసలకు గురిచేశాడని ఆమె వివరించారు. శ్రీకర్‌రెడ్డి తనను మోసం చేశాడని, తనపై పలు మార్లు అత్యాచారం చేశాడని, చెప్పినట్లు చేయకపోతే చంపేస్తానని బెదిరించాడని ఆమె చెప్పారు.
దిగ్బ్రాంతికి గురయ్యా
మొదట్లో ఓ యువతి ఇలాంటి కేసు పెట్టడంతో దిగ్బ్రాంతికి గురయ్యానని ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ తెలిపారు. బాధిత యువతితో చర్చించిన తర్వాత ప్రకటన చేద్దామని ఇప్పటి వరకూ స్పందించలేదన్నారు. ఆమెను చిత్రహింసలకు గురి చేసిన డాలర్ బాయ్‌పై చర్యలు తీసుకోవాలని మందకృష్ణ కోరారు.
నన్ను ఎవరూ రేప్ చేయలేదు.. అంతా తూచ్
RELATED ARTICLES