కీర్తి సురేష్ సౌత్ ఇండియన్ సినిమాలో ప్రముఖ హీరోయిన్. నటి కీర్తి సురేష్ తెలుగు మరియు తమిళ సినిమాలలో చాలా చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ‘బేబీ’ జాన్ సినిమాతో కీర్తి సురేష్ బాలీవుడ్ లో అరంగేట్రం చేయనుంది.ఇటీవలే హీరోయిన్ కీర్తి సురేష్ వివాహం గురించి ఇటీవల వార్తలు వచ్చాయి. నటి కీర్తి సురేష్ తన ఫ్రెండ్ ఆంటోనీ ని పెళ్లాడబోతోంది అని తెలుస్తుంది. అయితే కీర్తి సురేష్ స్నేహితుడు ఆంటోనీని పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది.ఇప్పుడు నటి కీర్తి సురేష్ ఆంటోనితో తన ప్రేమను ధృవీకరించింది. మరియు ఆమె తన సోషల్ మీడియాలో సంబంధిత ఫోటోను పోస్ట్ చేసింది. అతనితో 15 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నానని పోస్ట్ చేసింది. ఆంటోనీ కేరళలో పెద్ద వ్యాపారవేత్త అని తెలుస్తుంది. డిసెంబర్ 11న గోవాలో వీరి వివాహం జరగనుందని సమాచారం.