Homeఅంతర్జాతీయంబొగ్గు గనిలో ప్రమాదం.. ఊపిరాడక 16 మంది మృతి

బొగ్గు గనిలో ప్రమాదం.. ఊపిరాడక 16 మంది మృతి

బీజింగ్‌: చైనా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న చోఘింగ్‌ ఎనర్జీ సంస్థ బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. నైరుతి చైనాలో ఉన్న ఈ బొగ్గు గనిలో కన్వేయర్‌ బెల్ట్‌ కాలిపోవడంతో పెద్ద ఎత్తున కార్బన్‌ మోనాక్సైడ్‌ విడుదలైందని, దీంతో గనిలో పనిచేస్తున్న 16 మంది ఊపిరాడక మృతి చెందారని చైనా అధికారిక వార్తా సంస్థ జింగ్వా పేర్కొంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని గిజియాంగ్‌ జిల్లా యంత్రాంగం సోషల్‌ మీడియాలో వెల్లడించింది.
చైనా బొగ్గు గనుల్లో ప్రమాదాల సాధారణంగా మారాయి. గత డిసెంబర్‌లో జరిగిన ఓ బొగ్గుగనిలో గ్యాస్‌ పేలుడు జరిగి 14 మంది మృతి చెందారు. 2018 డిసెంబర్‌లో ఇదే చోఘింగ్‌ ఎనర్జీ సంస్థలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. అదే ఏడాది అక్టోబర్‌లో షాన్‌డోంగ్‌ జిల్లాలో జరిగిన మరో బొగ్గు గని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు విడిచారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img