తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖలో మరో 1690 వైద్యుల పోస్టుల భర్తీకి ఆ శాఖ కసరత్తు చేస్తోంది. వైద్య విధానపరిషత్‌లో కీలకమైన జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో వైద్యుల కొరత నేపథ్యంలో ఆర్థికశాఖ అనుమతించిన 1690 పోస్టులకు నోటిఫికేషన్ జారీకి సిద్ధమవుతోంది. నవంబరులో నోటిఫికేషన్ ఇచ్చి మార్చి లేదా ఏప్రిల్ నాటికి పోస్టులు భర్తీ చేయాలని భావిస్తోంది.