Homeజాతీయం17 మంది ఎంపీలకు కరోనా

17 మంది ఎంపీలకు కరోనా

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఈ నెల 13న లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు కొవిడ్‌ టెస్ట్‌లు చేయించగా.. నివేదికలు వచ్చాయి. వీరిలో 17 మందికి వైరస్‌ సోకినట్టు సమాచారం. కరోనా బారిన పడినవారిలో అధికార భాజపాకు చెందిన వారు 12 మంది సభ్యులు కాగా.. వైకాపాకు చెందిన ఇద్దరు, శివసేన, డీఎంకే, ఆర్‌ఎల్‌పీ పార్టీలకు చెందిన ఒక్కో ఎంపీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైకాపాకు చెందిన ఇద్దరు ఎంపీల్లో అరకు ఎంపీ మాధవి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు ఏడుగురు కేంద్రమంత్రులు, 25 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడగా ఒక ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు ప్రాణాలు కోల్పోయారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img