190 crore scam : తమిళ హీరో విజయ్ ఆంటోనీ సరికొత్త సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ”బిచ్చగాడు” సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత కొన్ని ప్లాప్ లు వచ్చిన అతని క్రేజ్ మాత్రం తగ్గలేదు. విజయ్ ఆంటోనీ కి అట్టు తమిళంలోనూ ఇటు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. ఈ క్రమంలో విజయ్ ఆంటోనీ కొత్త సినిమాలో నటించాడు. విజయ్ ఆంటోనీ తన 25వ సినిమాగా ”భద్రకాళి” అనే యాక్షన్ డ్రామాలో నటించాడు. తాజాగా ఈ సినిమాకి సంబందించిన టీజర్ ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ సినిమా టీజర్ చూస్తుంటే దీని కధ మొత్తం 190 కోట్ల భారీ స్కామ్ (190 crore scam) చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాతో విజయ్ ఆంటోనీ ఒక బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టబోతున్నాడు అని తెలుస్తుంది. ఈ సినిమాకి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, తృప్తి రవీంద్ర హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా త్వరలోనే థియేటర్లలోవిడుదల కానుంది.