వివిధ కారణాలను పేర్కొంటూ ఏపీలో 2 లక్షల పెన్షన్లు తొలగించారనే వైసీపీ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 2 లక్షల పెన్షన్లు తొలగించారనేది అవాస్తవమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బదులిచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి 80 వేల మంది చనిపోయారని తెలిపారు. అనర్హులు 14 వేల మందిని మాత్రమే తొలగించారని ఆయన అన్నారు. అనర్హులైన 14 వేల మందిని మాత్రమే తొలగించామని అన్నారు. హెల్త్ పెన్షన్‌కు అర్హులు ఎప్పుడైనా అర్జీ పెట్టుకోవచ్చని మంత్రి క్లారిటీ ఇచ్చారు.