మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ వెల్లడించారు. ఈ మేరకు విశాఖ నుంచి 23 విమానాల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ‘విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో ఆపరేషన్‌లో ఉంచుతున్నాం. అత్యవసర సర్వీసులు, మళ్లింపుల కోసం ఏటీసీ 24 గంటలూ పని చేస్తుంది. రన్‌వే నవీకరణ పనుల వల్ల రాత్రి 8 వరకే విమానాశ్రయంలో రాకపోకలకు అనుమతి ఇస్తున్నాం’అని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ తెలిపారు.