హైదరాబాద్‌లో 20 పార్కులు పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 2014తో పొలిస్తే 2024 నాటికి ఎన్ని చెరువులు ఉన్నాయి.. ఎన్ని కబ్జా అయ్యాయి అన్న దానిపై వివరాలు సేకరించామన్నారు. ఇందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను మీడియాకు చూపించారు. చెరువుల ఆక్రమణ హైదరాబాద్‌కు పెను ప్రమాదంగా మారుతోందని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు.