Homeహైదరాబాద్latest NewsT20 world cup 2024: భారత్ vs పాకిస్తాన్.. న్యూయార్క్‌లో భారీగా పెరిగిన హోటల్ ధరలు…

T20 world cup 2024: భారత్ vs పాకిస్తాన్.. న్యూయార్క్‌లో భారీగా పెరిగిన హోటల్ ధరలు…

న్యూయార్క్‌లో హోటల్ ధరలు విపరీతంగా పెరిగాయి. టీ20 ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్‌ ఆతిథ్యం ఇస్తుండగా.. జూన్‌ 9న భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరగడమే అసలు కారణం. ఈ మ్యాచ్ పై క్రికెట్ అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. అయితే ఈ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు ఎక్కువ ఇష్టపడుతారు. దాయాదుల మధ్య పోరు అంటే.. ఏ దేశానికైనా వెళ్తారు.. ఎంత డబ్బు అయినా ఖర్చు చేస్తారు. గతేడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరిగింది. ఆ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగా పోటీ పడ్డారో తెలిసిందే.. మ్యాచ్ టిక్కెట్లు పొందిన వారు బస చేసేందుకు హోటళ్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హోటళ్లన్నీ నిండిపోవడంతో హౌస్ ఫుల్ బోర్డులు పెట్టారు. అప్పుడు కూడా హోటళ్ల ధరలు విపరీతంగా పెరిగాయి.

ఇప్పుడు న్యూయార్క్‌లో కూడా అలాంటి పరిస్థితే ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ హోటళ్ల రేట్లు విపరీతంగా పెరిగాయి. కొన్ని హోటళ్ల ధరలు 600 శాతం పెరిగాయి. ప్రస్తుతం న్యూయార్క్‌లోని కొన్ని హోటళ్లలో గదుల ధర రూ. 9,422.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరిగే రోజు ఈ ధర రూ. 66,624గా ఉండటం గమనార్హం. దీని బట్టి భారత్-పాక్ మధ్య మ్యాచ్ అంటే క్రేజ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ మెగా టోర్నీ మరో 29 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈసారి ఈ టోర్నీలో 20 దేశాలు పాల్గొంటున్నాయి. ఈ ఐసీసీ టోర్నీలో మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నీ జూన్ 2 నుంచి 29 వరకు జరగనుంది.

Recent

- Advertisment -spot_img