Homeహైదరాబాద్latest Newsపాకిస్థాన్‌లో జైలు నుంచి తప్పించుకున్న 200 మంది ఖైదీలు.. కాల్పుల్లో 20 మంది మృతి..!

పాకిస్థాన్‌లో జైలు నుంచి తప్పించుకున్న 200 మంది ఖైదీలు.. కాల్పుల్లో 20 మంది మృతి..!

పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న మాలిర్ జైలు నుంచి సుమారు 200 మంది ఖైదీలు పారిపోయిన ఘటన సంచలనం సృష్టించింది. పారిపోయిన వారిలో ఎక్కువ మంది తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నవారేనని సమాచారం. ఖైదీలను అడ్డుకునేందుకు పోలీసులు చేపట్టిన కాల్పుల్లో సుమారు 20 మంది ఖైదీలు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమై, పరారీలో ఉన్న ఖైదీలను పట్టుకునేందుకు విస్తృత చర్యలు చేపట్టారు. ఈ జైలు బద్దలు ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలగాలను కూడా మోహరించినట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img