Homeహైదరాబాద్latest News2018 గ్రూప్​ 1 రద్దు

2018 గ్రూప్​ 1 రద్దు

– ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఏపీపీఎస్సీ 2018లో నిర్వహించిన గ్రూప్​ 1 మెయిన్స్​ పరీక్షను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గతంలో జరిగిన మెయిన్స్‌ పరీక్షను రద్దు చేసింది. జవాబు పత్రాలను మాన్యువల్‌ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మొదటిసారి దిద్దిన ఫలితాలను తొక్కిపెట్టి, రెండోసారి దిద్దించి నచ్చిన వారిని ఎంపిక చేసుకొని ఏపీపీఎస్సీ ఫలితాలు ప్రకటించిందని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడించింది.

Recent

- Advertisment -spot_img