Homeహైదరాబాద్latest News22 సినిమాలు ఫ్లాప్.. సినీ ఇండస్ట్రీకి గుడ్ బై.. జ్యూస్ షాప్ తో కోట్లు సంపాదించిన...

22 సినిమాలు ఫ్లాప్.. సినీ ఇండస్ట్రీకి గుడ్ బై.. జ్యూస్ షాప్ తో కోట్లు సంపాదించిన హీరో ఎవరో తెలుసా..?

ఒక హీరో ఒకేసారి 23 సినిమాలు చేసాడు, ఒకటి కాదు, రెండు కాదు.. అందులో 22 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. సినిమా నుంచి తప్పుకున్న ఈ హీరో జ్యూస్ షాప్ ఓపెన్ చేసి కోట్లు సంపాదించాడు.డినో మోరియా హీరోగా 1999లో ‘ప్యార్ మే కభీ కభీ’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఇది బాక్సాఫీస్ వద్ద పూర్తిగా ఫ్లాప్ అయింది. ఇంత పెద్ద ఫ్లాప్ అయినప్పటికీ.. పరాజయాలు ఎదురైనా 2002లో ‘రాజ్’ అనే థ్రిల్లర్ తో సూపర్ హిట్ కొట్టాడు. ఆ సినిమా డినో మోరియాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.. ఆ ఒక్క సినిమాతో చాలా పాపులారిటీ సంపాదించాడు.. బిపాసా బసుతో ఈ సినిమా ₹5 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఈ చిత్రం ₹ 37 కోట్లు వసూలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ సినిమా విజయం డినోకు ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ని అందించింది, కానీ దానిని నిలబెట్టుకోవడం సవాలుగా మారింది. కానీ ఆ తరువాత అతనుచేసిన 22 సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. కానీ, అనుకున్నంతగా సినిమాలు రాకపోవడంతో.. డినో సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపారవేత్తగా సూపర్ సక్సెస్ అందుకున్నాడు. 2012లో క్రికెట్ ఐకాన్ ఎంఎస్ ధోనీతో కలిసి కూల్ మాల్ అనే వ్యాపార సంస్థను స్థాపించాడు. తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ, డినో క్లాక్‌వైస్ ఫిల్మ్స్ అనే పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. జిస్మ్ 2 చిత్రాన్ని నిర్మించారు. 2018లో మిథిల్ కోల్డ్ ప్రెస్డ్ జ్యూస్ బ్రాండ్ ది ఫ్రెష్ ప్రెస్‌ను లోధా మరియు రాహుల్ జైన్‌లతో కలిసి స్థాపించాడు.బ్రాండ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఇది గుజరాత్, రాజస్థాన్ మరియు ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో విస్తరణలను ప్లాన్ చేస్తుంది. నేడు డినో మోరియా 150 కోట్ల రూపాయలకు యజమానిగా మారాడు. ఆ తరువాత ఈ హీరో అఖిల్ సినిమా ”ఏజెంట్”లో విల్లన్ గా నటించాడు.k 4 ఇదేనిజం 22 సినిమాలు ఫ్లాప్.. సినీ ఇండస్ట్రీకి గుడ్ బై.. జ్యూస్ షాప్ తో కోట్లు సంపాదించిన హీరో ఎవరో తెలుసా..?ss ఇదేనిజం 22 సినిమాలు ఫ్లాప్.. సినీ ఇండస్ట్రీకి గుడ్ బై.. జ్యూస్ షాప్ తో కోట్లు సంపాదించిన హీరో ఎవరో తెలుసా..?

Recent

- Advertisment -spot_img