తెలంగాణలో 22 మహిళా శక్తి భవనాలు సిద్ధమవుతున్నాయని.. మహిళలను కోటీశ్వరులను చేయాలన్నది CM రేవంత్ సంకల్పమని CS శాంతికుమారి తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం అమలుపై శుక్రవారం సీఎస్ చేపట్టారు. హైదరాబాద్ లోని శిల్పారామంలో 106 స్టాళ్లతో ఇందిరా మహిళా శక్తి బజార్ పనులను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. తొలివిడతలో 1000 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి దశలో 150 బస్సులను కొనుగోలు చేయనున్నారు.