– దసరా సెలవుల్లో స్వల్ప మార్పులు
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఇదేనిజం, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సెలవుల జాబితాలో స్వల్ప మార్పులు చేసింది. దసరా సెలవును అక్టోబరు 23కి మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. అంతేకాకుండా అక్టోబరు 24వ తేదీని కూడా సెలవుదినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాదికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితాలో అక్టోబరు 24వ తేదీన ‘దసరా సెలవు’ దినంగా పేర్కొంది.