తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా మరికొన్ని రైళ్లు రద్దయ్యాయి. 28 రైళ్లను రద్దు చేయగా, కొన్నింటిని దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు సీపీఆర్వో శ్రీధర్ ఓ ప్రకటన విడుదల చేశారు. వర్షాల కారణంగా సోమవారం వరకు 496 రైళ్లు రద్దు కాగా.. 152 సర్వీసులను దారి మళ్లించారు. తాజాగా 28 రైళ్లు రద్దు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లు రెండు రోజుల పాటు రద్దయ్యాయి.