హైదరాబాద్ మహానగరంలో ఇవాళ 3 కీలక ఘట్టాలు జరగబోతున్నాయి. ఓ వైపు గణేశ్ శోభాయాత్ర.. వేలాది విగ్రహాల నిమజ్జనం జరగనుంది. మరోవైపు పబ్లిక్ గార్డెన్స్ లో ప్రజా పాలన దినోత్సవానికి సీఎం రేవంత్ హాజరు, పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే విమోచన దినోత్సవానికి కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్, సంజయ్, కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.