Homeతెలంగాణ300 రైళ్లు రద్దు

300 రైళ్లు రద్దు

– దక్షిణ మధ్య రైల్వే వెల్లడి

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: మిచాంగ్ తుఫాన్ కారణంగా 300 రైళ్లు రద్దయ్యాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే​ పరిధిలో రైళ్లపై తుపాన్‌ ఎఫెక్ట్‌ మీద మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మరో 10 రైళ్లు గూడూరు చెన్నై- రూట్‌లో కాకుండా ఇతర రూట్లలో దారి మళ్లిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ‘ప్రస్తుతం రైల్వే ట్రాక్ లపై ఎక్కడా నీరు నిలవలేదు. వరద నిలిచే ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించాం. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రైళ్ల రద్దు సమాచారం అందించాం. ఎస్ఎంఎస్‌లు, సామాజిక మాధ్యమాల్లోనూ అందించాం. ప్రయాణికుల రిజర్వేషన్ చార్జీలు రీఫండ్ చేశాం. తుఫాన్ తీరం దాటాక వీలైనంత త్వరగా రైలు సర్వీసులను పునరుద్ధరిస్తాం’ అని సీపీఆర్వో తెలిపారు.

Recent

- Advertisment -spot_img