Homeఫ్లాష్ ఫ్లాష్#Sachin #Tendulkar : మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ అరంగేట్రానికి 31 ఏళ్లు..

#Sachin #Tendulkar : మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ అరంగేట్రానికి 31 ఏళ్లు..

హైదరాబాద్: మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెంండూల్క‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికేట్‌లోకి అడుగుపెట్టి నేటితో స‌రిగ్గా 31 సంవ‌త్స‌రాలైంది. 31 ఏళ్ల క్రితం (1989, నవంబర్ 15) ఇదే రోజు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

క్రికెట్ హిస్ట‌రీలో ఎన్నో రికార్డులు సృష్టించిన స‌చిన్ ఆ క్రీడ‌లో దేవుడిగా పేరు సంపాదించుకున్నాడు. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్న మాస్టర్ బ్లాస్టర్ క్రికెట్‌కే వన్నెతెచ్చాడు.

16 ఏళ్ల‌కే క్రికెట్ గ్రౌండ్‌లో అడుగుపెట్టిన స‌చిన్ ఆ త‌ర్వాత ఎన్న‌డూ వెన‌క్కు తిరిగి చూసుకోలేదు. సెంచ‌రీ సెంచ‌రీల‌తో ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో నిలిచి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.

త‌న ఫ‌స్ట్ టెస్టు మ్యాచ్ చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్‌తో కావ‌డం మ‌రో విశేషం. వసీం అక్రమ్, వకార్ యూనిస్ బౌలింగ్‌ను కాచుకుని 24 బంతుల్లో 12 ప‌రుగులు చేశాడు. కానీ రెండో టెస్టులో టాపార్డర్ విఫలమైన వేళ ఓపికగా ఆడిన సచిన్ 59 పరుగులు చేసి హౌరా అనిపించుకున్నాడు.

1989లో అరంగేట్రం చేసిన సచిన్‌కు ఫస్ట్‌ సెంచరీ చేయడానికి 8 టెస్టుల వరకు ఆగాల్సి వచ్చింది. 1990, ఆగస్టు 14న ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో ఈ ఘ‌న‌త సాధించి 17 ఏళ్ల వయసులోనే సెంచరీ చేసిన అత్యంత పిన్నవయస్కుడి రికార్డు నెలకొల్పాడు.

అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచకప్‌ ఆడిన క్రికెటర్‌గా స‌చిన్ నిలిచాడు. అంతర్జాతీయ టెస్టుల్లో 200 మ్యాచ్‌లు ఆడిన ఒకేఒక్క‌డు.. 15921 రన్స్ చేసిన వీరుడు. 463 వ‌న్డేల్లో 18426 ర‌న్స్ చేశాడు. టెస్టుల్లో 51, వ‌న్డేల్లో 49 సెంచ‌రీలు కొట్టాడు. 200 వికెట్లను ప‌డ‌గొట్టాడు.

2012 డిసెంబర్‌లో వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన సచిన్.. 2013 అక్టోబర్‌లో టీ20లకు, 2013 నవంబర్‌ 13న అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img