Homeజిల్లా వార్తలు30 రోజుల్లో  345 మొబైల్ ఫోన్‌లు రికవరీ.. యజమానులకు అందజేసిన సైబరాబాద్ పోలీసులు..

30 రోజుల్లో  345 మొబైల్ ఫోన్‌లు రికవరీ.. యజమానులకు అందజేసిన సైబరాబాద్ పోలీసులు..

ఇదేనిజం, శేరిలింగంపల్లి: 30 రోజుల్లో దొంగిలించబడిన, పోగొట్టుకున్న 345 మొబైల్ ఫోన్‌లను సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిసిపిక్రైమ్స్ కె.నరసింహ పర్యవేక్షణలో ఐటి సెల్, సామాజిక బృందం సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సిఇఐఆర్) పోర్టల్‌ను ఉపయోగించి 30 రోజుల్లో 345 మొబైల్ పరికరాలను విజయవంతంగా రికవరీ చేసింది. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను సైబరాబాద్ కమిషనరేట్ ప్రధాన సమావేశ మందిరంలో డీసీపీ క్రైమ్స్ కె.నరసింహ గురువారం యజమానులకు అందజేశారు. డీసీపీ క్రైమ్స్‌  కె.నరసింహ మాట్లాడుతూ.. నిత్యజీవితంలో మొబైల్‌ ఫోన్లు కీలకమని, ఎన్నో ముఖ్యమైన సమాచారం, జ్ఞాపకాలను కలిగి ఉంటారన్నారు. పోలీసులు రికవరీలో పట్టుదలతో ఉండాలని సూచించారు. దొంగిలించబడిన మొబైల్‌లు దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి, పోగొట్టుకున్న మొబైల్‌ల వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్‌కు లేదా CEIR పోర్టల్ కి నివేదించాలని డీసీపీ సూచించారు. విజయవంతంగా మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్న ఏసీపీ క్రైమ్స్ కళింగరావు, ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్ జగదీశ్వర్, ఐటీ సెల్ బృందాన్ని డీసీపీ క్రైమ్స్ అభినందించారు. రికవరీ చేసిన మొబైల్‌ ఫోన్‌లు అందుకున్నవారు సంతోషంతో కృతజ్ఞతలు తెలిపారు.

Recent

- Advertisment -spot_img