Homeహైదరాబాద్latest News3500 కోట్ల ఆస్తి.. తనకంటే 10 ఏళ్ల చిన్నవాడైన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోనున్న స్టార్ హీరోయిన్...

3500 కోట్ల ఆస్తి.. తనకంటే 10 ఏళ్ల చిన్నవాడైన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోనున్న స్టార్ హీరోయిన్ ..!

ప్రముఖ హీరోయిన్ కృతి సనన్ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. 2025లో వీరి వివాహం జరగనుందని వార్తలు వస్తున్నాయి. నటి కృతి సనన్ గత కొన్ని నెలలుగా తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా హీరోయిన్ కృతి సనన్ వచ్చే ఏడాది అంటే 2025లో పెళ్లి చేసుకోనుందనే వార్త బాలీవుడ్ లో హల్చల్ చేస్తోంది. కృతి సనన్ ప్రియుడు, వ్యాపారవేత్త కబీర్ బహియాను వివాహం చేసుకోనుందని పుకార్లు వచ్చాయి. దుబాయ్‌లో కృతి సనన్ మరియు కబీర్ బహియా ఇద్దరి ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. భారత క్రికెటర్ ఎంఎస్ ధోనీకి కబీర్ సన్నిహితుడు.కృతి సనన్ తన 34వ పుట్టినరోజును వ్యాపారవేత్త కబీర్ బహియాతో కలిసి జరుపుకుంది. ఈ ఫోటోలు వైరల్ కావడంతో, డేటింగ్ రూమర్స్ వ్యాపించాయి. కబీర్ బహియా ధనిక వ్యాపారవేత్త. అతని తండ్రి కుల్జీందర్ బహియా సౌతాల్ ట్రావెల్ వ్యవస్థాపకుడు. కబీర్ UKలో మల్టీ-మిలియనీర్ వ్యాపారవేత్త. బహియా కుటుంబం లండన్‌లోని అత్యంత ధనిక కుటుంబాలలో ఒకటి. ఈ కుటుంబం మొత్తం సంపద దాదాపు 3500 కోట్లు ఉంటుందని సమాచారం. కబీర్ లండన్‌లో ఉంటున్నాడు. కొన్ని నివేదికలు కృతికి 34 సంవత్సరాలు మరియు కబీర్ వయస్సు 24 సంవత్సరాలు. తన కంటే 10 సంవత్సరాలు చిన్నవాడైన కబీర్ ని కృతి పెళ్లి చేసుకోబోతుంది.sf 1 ఇదేనిజం 3500 కోట్ల ఆస్తి.. తనకంటే 10 ఏళ్ల చిన్నవాడైన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోనున్న స్టార్ హీరోయిన్ ..!

Recent

- Advertisment -spot_img