Homeహైదరాబాద్latest News'విద్యాధన్' స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి

‘విద్యాధన్’ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి

– మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా

కొత్తగూడెం: ఇంటర్, పాలిటెక్నిక్‌లలో మొదటి సంవ‌త్స‌రం ప్రవేశాలు పొందే విద్యార్దుల కొర‌కు స‌రోజిని దామోద‌ర్ ఫౌండేషన్ వారు అందిస్తున్న “విద్యాధన్” స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ మరియు గుర్తింపు పొందిన పాఠశాలలో పదవ తరగతిలో 9 జీపీఏ సాధించి, సంవత్సర ఆదాయం 2 లక్షలు కలిగిన వారు ఈయొక్క స్కాలర్షిప్ లు పొందేందుకు అర్హులని పేర్కొన్నారు. విద్యార్ధులు తమ పదవ తరగతి మార్కుల మెమో , ఆదాయ ద్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో www.vidyadaan.org అనే వెబ్‌సైట్ నందు జూన్ 15వ తేదీలోపు ఆన్లైన్ లో వివరాలను నమోదు చేసుకోవాలని అన్నారు. అర్హులైన వారికి జులై 7వ తేదీన ఆన్‌లైన్‌లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించ బడుతుందని తెలిపారు. స్క్రీనింగ్ టెస్ట్ లో మెరిట్ సాధించిన విద్యార్దులకు ప్రతి ఏటా 10 వేల నుండి 60 వేల వరకు స్కాలర్షిప్ లు అందుతాయని, అన్నీ వర్గాలకు చెందిన విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 8520860785, 9663517131 అనే నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.

Recent

- Advertisment -spot_img