తెలంగాణలో ఏడాది పాలనలో రుణమాఫీ, సన్నాలకు బోనస్, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని సీఎం రేవంత్ అన్నారు. త్వరలోనే రాష్ట్రంలో 4లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని Xవేదికగా తెలిపారు. మహిళలకు ఫ్రీ బస్, రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ, వడ్లకు రూ.500 బోనస్, 55,000 జాబ్స్ అందించామని స్పష్టం చేశారు.