Homeహైదరాబాద్latest NewsTelangana Schemes: 4 కొత్త పథకాలు.. రేపటి నుంచి లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ

Telangana Schemes: 4 కొత్త పథకాలు.. రేపటి నుంచి లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ

Telangana Schemes: అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాలు అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. రేపు రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులకు సంబంధించిన నాలుగు పథకాలను రేపు మ.1 గంటకు లాంచనంగా ప్రారంభించబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో శనివారం సీఎం రేవంత్ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. 4 పథకాలు రేపు ప్రతి మండలంలోని ఒక గ్రామంలో నూరు శాతం అమలు చేయబోతున్నట్లు తెలిపారు.

Telangana Schemes:రేపటి నుంచి లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ

new schemes 1 ఇదేనిజం Telangana Schemes: 4 కొత్త పథకాలు.. రేపటి నుంచి లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ


రేపు 4 పథకాలకు లక్షల్లో దరఖాస్తులు వచ్చినందున రేపటి నుంచి మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని డిప్యూటీ సీఎంభట్టి విక్రమార్క తెలిపారు. లబ్దిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించామన్నారు. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామని, భూమిలేని నిరుపేద, ఉపాధి హామీ పథకంలో 20 రోజుల పాటు పనిచేసిన వారికి ఆత్మీయ భరోసా అమలు చేస్తామన్నారు.

ALSO READ: Rythu Bharosa: రైతు భరోసా.. రేపటి నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు..!

Recent

- Advertisment -spot_img