ప్రముఖ తెలుగు సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో పెద్ద పంచాయతీ నడుస్తుంది. నిన్న ఉదయం మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య గొడవ జరిగింది. అనంతరం మనోజ్ గాయాలతో ఆస్పత్రికి చేరుకున్నాడు. చికిత్స అనంతరం హైదరాబాద్ జల్ పల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం మంచు వారి ఇంట్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటికి పోటీగా బౌన్సర్లు చేరుకుంటున్నారు. విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు రాగా, మంచు మనోజ్ కూడా 30 మంది ప్రైవేట్ బౌన్సర్లను తీసుకొచ్చారు. అయితే మోహన్ బాబు ఇంటి దగ్గరికి మనోజ్ బౌన్సర్లను అనుమతించడం లేదని సమాచారం. ఇదిలా ఉంటే మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకుని తన తండ్రి ఇంటికి వస్తాడనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా మంచు లక్ష్మి ఫామ్ హౌస్ కి చేరుకుంది.