నిబంధనలకు విరుద్ధంగా గోవా నుంచి నగరానికి నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం తరలిస్తున్న ఏడుగురిని రంగారెడ్డి జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.12 లక్షల విలువ చేసే 415 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. గోవా నుంచి మూడు విమానాల్లో మద్యం వస్తుందనే సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ వీబీ.కమలాసన్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ అదేశాలతో ఏఈఎస్ జీవన్‌కిరణ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగి నిందితును పట్టుకున్నారు.